Home » ATM
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి.. వైద్య చికిత్స అందించారు.
జిల్లాను వరస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకే(ఎస్‌బీఐ) లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడుతూ లక్షల సొత్తును కాజేస్తున్నారు. సినిమా లెవల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
ఒక సెక్యూరిటీ గార్డు ఏటీఎమ్ సెంటర్‌ను తన ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేసుకున్నాడు. తను కాపలా ఉండాల్సిన ఏటీఎమ్ సెంటర్‌లో బట్టలు కుట్టే మెషిన్ ఏర్పాటు చేసుకుని బట్టలు కుడుతున్నాడు. అతడి నిర్వాకాన్ని చూసిన వాళ్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
పాపం ఆ దొంగలకు.. దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాలో అర్థం కాలేదనుకుంటా. అందుకే మర్రి చెట్టు తొర్రలో దాటి పెట్టారు. అది కూడా ఒకటి.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 66 లక్షలు. అయితే దొంగతనం జరిగిందన్న తర్వాత.. పోలీసులు ఉరుకుంటారా? ఆ దొంగలను పట్టుకొన్నారు.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇకపై మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. బ్యాంకులు(banks), ఏటీఎంల(atms) నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం పాత ట్రెండ్. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ద్వారా ఆన్‌లైన్ ఆధార్(Aadhaar ATM) ATM (AePS) సేవను పొందడం ద్వారా మీరు ఇంటి వద్దనే సులభంగా నగదును తీసుకోవచ్చు.
ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడే గజదొంగ తంబిరాజ్‌ను కోయంబత్తూరు క్రైం పోలీసులు(Coimbatore Crime Police) అరెస్టు చేశారు. తంబిరాజ్‌పై రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ చోరీ కేసులున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.
ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసే సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రావాల్సిన నగదు ఆగిపోతే.. మరికొన్నిసార్లు ఏటీఎం నుంచి అదనంగా నగదు బయటకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు..
నార్సింగిలో ఓ దొంగ రెచ్చిపోయారు. సన్ సిటీ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోకి చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫల యత్నం చేశాడు. ఏటీఎం మెషీన్‌ను తెరిచేందుకు శత విధాలుగా యత్నాలు సాగించాడు. తన వెంట తెచ్చుకున్న రాడ్‌తో ఏటీఎం కింది భాగాన్ని తెరవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు.
అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.