Home » Assam
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్‌షాను కలుస్తామని చెప్పారు.
అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.
అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడటంతో తన రాజీనామా నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు.
ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై ఆయన వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గౌరవ్ గొగోయ్ చెప్పారు.
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.