Home » Asaduddin Owaisi
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందటూ అసద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారానికి కారణమయ్యాయి.
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.
‘రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు. వెళ్లాలి కూడా. ఇందులో ద్వందార్థం లేదు. నేనూ చంద్రబాబు హయాం(1998)లో 50 రోజులు జైలులో ఉన్నా. ప్రతి రాజకీయ నేత ఏదో సందర్భంలో జైలుకు వెళ్తాడు.
తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీతో కొట్లాడాల్సి వస్తే.. కొట్లాడతానని, అసదుద్దీన్‌తో కలిసి పనిచేయాల్సి వస్తే.. కలిసికట్టుగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 అమలు కోరుతూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది.
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్‌కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.
హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.