Home » Asaduddin Owaisi
పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనీ, అయితే ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఒవైసీ అన్నారు.
ఇస్లాం శాంతి, సామరస్యానికి ప్రతిరూపం అని, పాకిస్థాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణహోమం సృష్టిస్తోందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
భారత్‌లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
పాకిస్థాన్ అభివృద్ధిలో అర్ధ శతాబ్దం వెనకపడిందని, వారి బడ్జెట్ భారత్ రక్షణ వ్యయం అంత కూడా కాదని ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదంపై పాక్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు
అణుబాంబులున్నాయంటూ పాక్ నేతలు చేస్తున్న బెదిరింపులను ఒవైసీ తిప్పికొట్టారు. ఒక దేశంలోకి అడుగుపెట్టి అమాయకులను కాల్చి చంపుతుంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఊరుకోదని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చిన ఉగ్రవాదులకు తగిన శిక్ష విధించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఉందని ఆరోపించిన ఆయన, కేంద్రం తీసుకునే శాంతి భద్రతా చర్యలకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు
వక్ఫ్ బోర్డ్ యూజర్ కాజ్‌ను తొలగించే అవకాశాలున్నాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్ల వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారు వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటారని అన్నారు.
రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు అంగీకరించరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదానికి బీజేపీకి అవసరమైన మెజారిటీ లేదని చెప్పారు.