Home » Asaduddin Owaisi
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC)పై చర్చ ఊపందుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం భోపాల్ నుంచి దీనిపై మాట్లాడటంతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రతిపక్షాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) ఉండాలని మోదీ చెప్పిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం తీవ్రంగా స్పందించాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి ప్రయత్నాల్లో భాగంగా పాట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు, నాయకుల గత చరిత్ర ఏమిటని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారంనాడిక్కడ నిలదీశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో రాష్ట్రీయ జనతాదళ్ పోల్చడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. బీహార్‌కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఉగ్రవాద సంస్థ చీఫ్‌కు (terrorist organization chief) ఒవైసీ ఫ్యామిలీతో (Owaisi family) సంబంధాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై (Bihar CM Nitish Kumar) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (AIMIM chief Asaduddin Owaisi) కన్నెర్ర చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, (Atiq Ahmed) అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) హత్యలపై మళ్లీ మాట్లాడారు.