Home » Army
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్(చిప్) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్ కమ్యూనికేషన్ బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
భారత 30వ సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.
భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా(COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 మేలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. ద్వివేది ఇదివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పని చేశారు.
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు
‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..
వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్ నౌకాదళ సిబ్బందిపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఆయుధాలు లేనప్పటికీ ఫిలిప్పీన్స్ సైనికులు వారిని చేతులతోనే సమర్థంగా ఎదుర్కొన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిని ఓసారి వచ్చిపో అంటూ కుమారుడు పిలవడం మానవ హృదయాలను కంటతడిపెట్టిస్తోంది. తన తండ్రి ఈలోకంలో లేరనే విషయాన్ని ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడూ తన కోసం వచ్చే తండ్రి కొద్దిరోజులుగా ఎందుకు రావడంలేదని ఆ చిన్నారి తల్లిని ప్రశ్నిస్తోంది.
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్ (ఈఈఎల్) ఈ యూఏవీ (మానవ రహిత విమానం) డ్రోన్లను తయారు చేసింది.