Home » Army
భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా(COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 మేలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. ద్వివేది ఇదివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పని చేశారు.
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్సైజ్లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు
‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..
వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్ నౌకాదళ సిబ్బందిపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఆయుధాలు లేనప్పటికీ ఫిలిప్పీన్స్ సైనికులు వారిని చేతులతోనే సమర్థంగా ఎదుర్కొన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిని ఓసారి వచ్చిపో అంటూ కుమారుడు పిలవడం మానవ హృదయాలను కంటతడిపెట్టిస్తోంది. తన తండ్రి ఈలోకంలో లేరనే విషయాన్ని ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడూ తన కోసం వచ్చే తండ్రి కొద్దిరోజులుగా ఎందుకు రావడంలేదని ఆ చిన్నారి తల్లిని ప్రశ్నిస్తోంది.
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్ (ఈఈఎల్) ఈ యూఏవీ (మానవ రహిత విమానం) డ్రోన్లను తయారు చేసింది.
భారత ఆర్మీకి కొత్త చీఫ్ రానున్నారు. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని
మన సైన్యాన్ని విపక్ష ‘ఇండీ’ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
భారత్(india), చైనా(china) సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మనోజ్ పాండే పదవీ కాలం మే 31తో ముగియనుంది.