Home » APSRTC
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్‌పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్‌నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది.
సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి.
సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలు ప్రయాణం కోసం నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి రథచక్రం దారి తప్పింది! డ్రైవర్ లేని బస్సు తరహాలో గమ్యంలేని ప్రయాణం చేస్తోంది!! కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటికి రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి.
ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు.
కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గ్రామాల నుంచి నగరాలకు అనుసంధనం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతంమన్నారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.
‘‘ప్రయాణికుల సంతృప్తే మనకు ముఖ్యం. వారి నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది? పరిష్కరించాల్సిన సిబ్బంది సమస్యలు ఏమున్నాయి?