Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్‌సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి.
అవును.. అక్షరాలా దేవుడి స్క్రిప్టే..! ఏపీ ఎన్నికల ఫలితాలతో (AP Election Results) సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది..! 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ (TDP) పరిమితం కావడంతో.. వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా హేళన చేసిందో.. ఎంతలా కించపరుస్తూ మాట్లాడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది..!
దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు.
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 60వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.