Home » AP CM
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకొచ్చింది.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. దీంతో ఏపీ సీఎంకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కాలేదు. తక్కువ కాలంలోనే ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సామాజిక భద్రత ఫించన్లను పెంచింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,