Home » AP Assembly Polls 2024
ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు.
ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం..