Home » Anurag Thakur
బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానే విడిచిపెట్టలేదని.. కవితను ఎలా విడిచిపెడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతం బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Scam) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయిన తరువాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కేజ్రివాల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.
సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. విపక్ష ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తాజా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని కొందరు నేతలు చెబుతున్నారని, వాళ్లు 'విద్వేష మెగా మాల్' తెరిచారని విమర్శించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..
ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత కమిటీ సిఫారసులను అమలు చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఆదివారం ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని నిర్ధారించారు.
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు వంటివాటిని చూసి లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.
ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.