Home » Anantapur urban
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్‌జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.
రాజకీయంగా కొన్ని సంప్రదాయాలు ఉంటా యని, ఏ ప్రభుత్వం అధి కారంలో ఉన్నా... శిలా ఫలకాలను ఏర్పాటు చేసే సందర్భంలో రాజకీ యాలకు అతీతంగా ప్ర జాప్రతినిధులు, సభ్యుల పేర్లు చేర్చడం అనవా యితీ అని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు.
శ్రీరామిరెడ్డి వాటర్ వర్క్స్ స్కీమ్ కార్మికుల పది నెలల వేతన బకాయిలు, 35 నెలల పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవా రం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం డిఆర్‌ఓ మలోలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం సంవత్సరంలో మూడు దఫాలు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.
మండల పరిధి లోని కల్లూరు, పాపినేపాళ్యం గ్రామా ల్లో మంగళవారం సుంకులమ్మ, చౌ డేశ్వరిదేవి అమ్మవార్ల జాతర వైభ వంగా జరిగింది. జాతర సందర్భంగా రెండు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా ఆలంకరించారు. ఆయా గ్రామాల్లో మంగళవారం ఉదయం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా బతికే దని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వర్కర్లు, ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు.
పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు.
పొలంలోని ట్రాన్స ఫార్మర్‌తో పాటు విద్యుతస్తంభం పై వరకు చెట్ల తీగలు అల్లుకు న్నాయి. దీంతో ఏ నిమిషంలో ప్రమాదం జరుగుతుందోనని రైతు లు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగుల జీవనోపాధులు మెరుగుపరచడమే ఐడియా(ఇనక్లూజివ్ దివ్యాంగ్జమ్ ఎంటర్‌ప్రెన్యూర్), సక్ష్యం స్వచ్ఛంద సంస్థల ధ్యేయమని ఐడియా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పంకజ్ అన్నారు. ఢిల్లీ నుంచి అనంతకు వచ్చిన సంస్థ ప్రతినిధులు వారం రోజులుగా దివ్యాంగుల వివరాలను సేకరిస్తున్నారు.
బీసీ సంక్షేమ వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆమె మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు అధ్వానస్థితికి చేరాయన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీ లకు పెద్ద పీట వేస్తోంద ని టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ య్య పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పద్మశాలి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ పో తుల లక్ష్మీనరసింహులు, టీడీపీ నాయకులు చండ్రాయుడుతో కలిసి ఆ య న మీడియాతో మాట్లాడారు.