Home » Anantapur urban
పాతూరులోని బృందా వన ఆంజనేయస్వామి (చిన్న ఆంజనేయస్వా మి) దేవస్థానంలో మం గళవారం వ్యాసరాయ స్వామి 486వ ఆరాధనో త్సవాలను వైభవంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అక్కడి నరసింహస్వామి మూల విరాట్‌కు, రాఘ వేంద్రస్వామి, వ్యాసరాయ బృందావనాలకు నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, వేదపండితుల ప్రవచనాలు నిర్వహించారు.
జాతీయస్థాయి పారా ఖేలో ఇండియా పో టీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీ నుంచి నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పారా ఖేలో ఇండియా క్రీడా పోటీలకు జిల్లా నుంచి పారా క్రీడాకారులు సహన, సాకే బాబు, నీలం పల్లవి, సంజయ్‌రెడ్డి ఎంపికయ్యారు. వారిని సోమవారం అభినందించారు.
ప్రభుత్వ ఉద్యోగోలు ప్రతి రోజూ ఉదయం 10గంటలకు కచ్చితంగా కార్యాలయాల్లో విధులకు హా జరు కావాలని ఉత్తర్వులు. అయితే వాటితో మాకు పనిలేదు... మేము వచ్చిందే టైం...వచ్చినప్పుడే విధులు నిర్వహిస్తామన్న చందంగా మారింది హంద్రినీవా సుజల స్రవంతి పథకం, హెచ్చెల్సీ కార్యాలయాల్లో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగుల తీరు. ఈ తతంగం సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో తేటతెల్లమైంది.
‘ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో అన్నీ లెక్కి స్తాం. అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి-వేడిగా సాగింది.
డ్వామాలో బదిలీల ప్రక్రియ మొదలయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నారు. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు చేయాలని సూచించినా.. తరువాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు వేర్వేరుగా బదిలీలు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశించింది.
అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు.
మండలంలోని ఎర్రంపల్లి వద్ద సోమవారం దుర్వాసన వెదజల్లుతూ రైల్వేట్రాక్ పక్కన, వంతెన కింద పడి ఉన్న మూటలు కలకలం రేపాయి. రైల్వే, స్థానిక పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎర్రంపల్లి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన మూడుచోట్ల వేర్వేరుగా ప్లాస్టిక్ సంచి మూటలు పడి ఉన్నాయి.ఒక్కో మూట మధ్య అర కిలోమీటరు మేర దూరం ఉంది.
ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న రెండో విడత మరమ్మతుల పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్లు ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత నెల ఆంధ్రజ్యోతిలో ‘నాణ్యత ప్రశ్నార్థకం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు ఆ శాఖ అధికారులతో పాటు ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ డీఈ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు.
నగర నడి బొడ్డున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న డీఆర్‌డీఏ అభ్యు దయ భవన పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 1986లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కుముద్‌బెన జోషి చేతుల మీదుగా అభ్యుదయ భవనను ప్రారంభించారు. అప్పటి నుంచి 2014 వరకు అంటే సుమారు 32ఏళ్ల పాటు ఎన్నో సమీక్షలు, సమావేశాలు, సభల నిర్వహణకు ఆ భవనం వేదికైంది.
కేవలం బడ్జెట్ అంశంతోనే కౌన్సిల్ సమావేశం జరుగుతుందా...? మరి కొన్ని అంశాలపైనా చర్చ నడుస్తుందా...? అనేది చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సోమవారం బడ్జెట్ అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రతి ఏటా బడ్జెట్ అంశంపైనే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నించేవారు.