Home » Anantapur urban
శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర ఘాట్ అధ్యక్షుడు తిరువీఽ దుల జగదీష్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లాకేంద్రంలోని పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న గోదాములలో భద్రపరిచిన ఈవీఎం లను జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ శనివారం తనికీ చేశారు. అదికారులు, రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో తలుపులు తీయించి ఈవీఎంలను పరిశీలించారు.
సిరులు కురిపించిన అరటి సాగు ప్రస్తుతం ఎండ తీవ్రకు బాగా దెబ్బతింటోంది. చెట్టు మీదనే అరటి గెలలు నల్లగా మారుతున్నాయి. ఎండలకు తోడు రాత్రి పూట చిన్న పాటి ఈదురు గాలులకు అరటి గెల బరువు వల్ల చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి. దీంతో పాటు అమాంతం ధరలు పడిపోవడంతో, కాయలను కోసే వ్యాపారులు లేక పోవడం వల్ల అరటి సాగుచేసిన రైతులు రూ. లక్షలు నష్టపోతున్నారు.
నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి కా లంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు ఇవ్యాల ని ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశాల అ నంతరం ఉప ముఖ్యమంత్రిని ఆయన చాంబర్‌లో కలిశారు.
ఏపీ సూపర్ ఫుట్‌బాల్ కప్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియం లో గురువారం ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఏపీ పుట్‌బాల్ అసోసి యేషన రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ఉపాధ్యక్షుడు సరిపూటి వేణు గోపాల్ పోటీలను ప్రారంభించారు. తుంగభద్ర జట్టుపై పెన్నా జట్టు 4 గోల్స్ తేడాతో విజయం సాధించగా.... నల్లమల జట్టుపై కోరమాండల్ జట్టు 2 గోల్స్ తేడాతో, గోదావరిపై కొల్లేరు 3గోల్స్, విశాఖపై వంశధార జట్టు 3 గోల్స్ తేడాతో గెలుపొందాయి.
మండలకేంద్ర మైన చెన్నేకొత్తపల్లిలో ఉన్న పురాతన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవా లయ పునర్నిర్మాణానికి నిధులివ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి చెన్నేకత్తపల్లి గ్రామస్థులు టీటీడీ బోర్డు సభ్యులు, మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి తన ఛాంబర్‌లో ఉన్న ఎంఎస్ రాజుకు వినతిప త్రం అందజేశారు.
వేసవికాలం వచ్చిం దంటే చాలు... నగరంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారు లు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇక సర్కిళ్లు, బస్టా్‌పల వద్ద నిలబడిన సమ యంలో వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికులను ఎండబారి నుంచి తప్పించేందుకు ప్రతి ఏడాది నగరంలోని పలు సర్కిళ్లు, బస్టా్‌పలలో పరదాలు కట్టేవారు. ఆ నీడలో కాస్త ఉపశమనం పొందే వీలుంటుంది.
విద్యుత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి మండల కేంద్రం సమీపంలోని మామిడి తోట మొత్తం కాలిపోయింది. మండలకేంద్రానికి చెందిన పున్న పు లక్ష్మీనారాయణ అనే రైతు దా దాపు నాలుగెకరాల్లో మామిడి చెట్లను పెంచుతున్నాడు. రోజు లాగానే రైతు బుధవా రం పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్లాడు.
ఉ మ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ బాలికల జట్టును ఎంపిక చేశా రు. బుధ వారం స్థాని క న్యూటౌన బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. జట్టు వివరాలను జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన అధ్యక్షుడు మహ్మద్‌రియాజ్, కార్యదర్శి సాకే శివశంకర్ ప్రకటించారు.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగేందుకు ఆడ పిల్లలకు స్వీయరక్షణ కోసం అనంత ఆత్మరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కలెక్టర్ బొల్లినేని వినూత్న పేర్కొన్నారు. అనంత ఆత్మ రక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో నిర్వహించారు.