Home » Anam Ramanarayana Reddy
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Anam Ramanarayana: 2004 జూన్ నాటికి ఏడాది కాలంలో 22 ప్రమాదాలు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల ఈ ఏడాది జూన్ నాటికి 10 ప్రమాదాలు జరిగాయని... ప్రమాదాలని పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
Minister Anam Ramanarayana Reddy: టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Minister Anam Ramanarayana Reddy: పారిశ్రామిక వేత్తలను ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
Minister Anam Ramanarayana Reddy: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం నాడు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సింహాచల గోడకూలిన విషాదంపై నేతల నుంచి తీవ్ర స్పందనలు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న స్పష్టత; జగన్‌పై అధికార పార్టీ ప్రతికారాత్మక విమర్శలు
సింహాచలంలో ప్రసాద స్కీం పనులు ఆలశ్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని మంత్రి చెప్పారు.
సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.