• Home » Amalapuram

Amalapuram

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

బ్రహ్మాడ నాయకుని బ్రహ్మోత్సవం

బ్రహ్మాడ నాయకుని బ్రహ్మోత్సవం

ఆత్రేయపురం(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకా

‘ఈవీ’ధంగా

‘ఈవీ’ధంగా

నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్‌ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.

Viral: పోలీస్ స్టేషన్‌లో పురోహితుడి కత్తి విన్యాసం.. వైరల్ వీడియో

Viral: పోలీస్ స్టేషన్‌లో పురోహితుడి కత్తి విన్యాసం.. వైరల్ వీడియో

పురోహితులంతా వేద మంత్ర పఠనాన్నే కాదు.. కొందరు యుద్ధ విద్యలోనూ ఆరితేరి ఉంటారన్నడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

హైవేల విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష

హైవేల విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష

జాతీయ రహదారి-216 విస్తరణ అభివృద్ధి పనులపై వస్తున్న అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాశర్లపూడి, మామిడికుదురులలో వచ్చిన అభ్యంతరాలపై ఆయన కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్షించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాల విలువల గణనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో పునఃపరిశీలన చేసి తాజాగా నివేదిక అందించాలని ఆదేశించారు.

గోవింద శంఖారావం

గోవింద శంఖారావం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్న ప్రధాన డిమాండ్‌తో గోవింద శంఖారావం పేరిట హిందూ సంఘాలు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిపాలవీధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది నిరసన ర్యాలీగా బయలుదేరారు.

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

వర్షాల సీజన్‌ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అర్జీదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీదారుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్‌ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

పారిస్ ఒలింపిక్స్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి