Home » Allu Arjun
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు.
మధ్యంతర బెయిల్‌పై ఉన్న నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు మంగళవారం మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను.. ఆ చిత్ర నిర్మాత యెర్నేనీ నవీన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. అయితే ఎపిసోడ్ కీలక ములుపులు తిరుగుతోంది.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని..
Andhrapradesh: అల్లు అర్జున్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. మరి చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బెన్‌ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు.