Home » Airport
ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావాల్సిన 280.30 ఎకరాల భూ సేకరణ చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కలకలం రేపాయి. గత రాత్రి రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళుతున్న సుబ్బరాజు అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను అధికారులు గుర్తించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని రోజులుగా వందలాది విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (బీసీఏఎస్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్‌లకు బెదిరింపులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.