• Home » AICC

AICC

Mastan vali: జగన్‌ను ఓడించడానికే పొత్తులనడం సిగ్గుచేటు...

Mastan vali: జగన్‌ను ఓడించడానికే పొత్తులనడం సిగ్గుచేటు...

Andhrapradesh: రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని మోదీ దుర్మార్గపు ఆలోచనలకు అండగా ఉన్నారని ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శలు గుప్పించారు. గురువారం ఆంధ్రరత్నభవన్‌లో ఏపీపీసీ ఎస్సీ విభాగం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుడిని హత్య చేసి ఇంటికి మూటకట్డి తీసుకెళ్తే ఎమ్మెల్సీపై చర్యలు లేవని.. పైగా బెయిల్ ఇప్పించి జగన్ పక్కన కూర్చో పెట్డుకున్నారని మండిపడ్డారు.

CM Revanth: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్..

CM Revanth: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్..

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. రేపు తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది.

Tulasireddy: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనం

Tulasireddy: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనం

Andhrapradesh: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనమని ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రిక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుందని.. కాబట్టి తరలించ వద్దన్నారు.

TS Politics: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. 20 నిమిషాల పాటు చర్చించిన విషయాలివే..?

TS Politics: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. 20 నిమిషాల పాటు చర్చించిన విషయాలివే..?

ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Sharmila: ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

Sharmila: ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

విజయవాడ: ఏపీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిలకు ఏపీసీసీ కార్యాలయంలో ఛాంబర్ సిద్ధమైంది. అలాతే ఆంధ్రరత్న భవన్‌లో షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు.

Congress: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీతో కాసేపట్లో భేటీ..!

Congress: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీతో కాసేపట్లో భేటీ..!

సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.

Congress: లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్

Congress: లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు.

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ( Congress ) కోఆర్డినేటర్లు గురువారం (రేపు) వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు నియమించారు.

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి