• Home » AIADMK

AIADMK

EPS: మాజీ సీఎం ఈపీఎస్‌ సరికొత్త పంథా..

EPS: మాజీ సీఎం ఈపీఎస్‌ సరికొత్త పంథా..

రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం కోసం-స్వేచ్ఛ కోసం’అనే కొత్త ప్రచార పథకానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీల్లో డీఎంకే ప్రభుత్వం 99 శాతం నెరవేర్చకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపించిందన్న పదాలతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు.

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది.

EPS: మాజీసీఎం ధ్వజం.. అన్నదాతలను పట్టించుకోని డీఎంకే ప్రభుత్వం

EPS: మాజీసీఎం ధ్వజం.. అన్నదాతలను పట్టించుకోని డీఎంకే ప్రభుత్వం

గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారికి ఎలాంటి సహాయాలు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు. తిరువారూరులో సోమవారం ఉదయం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన రైతులతో ఈపీఎస్‌ భేటీ అయ్యారు.

EPS: ఎన్నికల్లో మా వ్యూహాలు బయటకు చెప్పలేం..

EPS: ఎన్నికల్లో మా వ్యూహాలు బయటకు చెప్పలేం..

డీఎంకేను ఓడించాలనుకునే పార్టీలన్నీ ఏకేతాటిపైకి రావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తుపై మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. పళనిస్వామి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

EPS: రాష్ట్రంలో సంకీర్ణమని అమిత్‌షా చెప్పలేదు..

EPS: రాష్ట్రంలో సంకీర్ణమని అమిత్‌షా చెప్పలేదు..

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పలేదని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మరోమారు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తరుఫున చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార పయనంలో భాగంగా బుధవారం కడలూరు జిల్లా చిదంబరంలో ఈపీఎస్‌ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

EPS: ఏం డౌట్ లేదు.. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం..

EPS: ఏం డౌట్ లేదు.. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం..

బీజేపీ తదితర పార్టీల కలయికతో ఏర్పడిన పొత్తు పటిష్టమని, సొంత బలంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మాజీముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) మరోమారు ధీమా వ్యక్తంచేశారు.

PM Modi: నెలాఖరులో ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన

PM Modi: నెలాఖరులో ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా పార్టీ వినాశనం అసాధ్యం

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా పార్టీ వినాశనం అసాధ్యం

ప్రజాదరణతో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న అన్నాడీఎంకేను లేకుండా చేయడం ఎవరి తరము కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సవాలు విసిరారు. ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ అనే పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తొలివిడత ప్రచారంలో శుక్రవారం విల్లుపురం జిల్లాలో ఈపీఎస్‌ పర్యటించారు.

EPS: స్టాలిన్‌కు ఈపీఎస్‌ కౌంటర్‌.. ముందు మీ అవినీతి గురించి చెప్పండి

EPS: స్టాలిన్‌కు ఈపీఎస్‌ కౌంటర్‌.. ముందు మీ అవినీతి గురించి చెప్పండి

రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్‌, కరప్షన్‌ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు.

EPS: ఈసారి వచ్చేది మేమే.. మాకు ప్రజాదరణ అపారం

EPS: ఈసారి వచ్చేది మేమే.. మాకు ప్రజాదరణ అపారం

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలనా తీరుకు వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ అపారమని, అధికారంలోకి రాబోయేది తామేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి