Home » Adilabad
రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.
చెన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్ కార్యాల యంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
రైతుభరోసా, రేషన్‌కార్డుల సర్వేను పకడ్బం దీగా చేపట్టాలని ఆర్డీవో హరికృష్ణ సూచిం చారు. శనివారం కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆర్డీవో మాట్లాడుతూ తప్పులు లేకుం డా వివరాలను నమోదు చేయాలని పేర్కొ న్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మూడేళ్లుగా విడుదల కావడం లేదు. వీటిపై ఆధారపడ్డ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. విద్యార్థులను వార్షిక పరీక్షల రుసుం చెల్లించాలని, పూర్తయిన వారికి ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. నిధులు విడుదల చేయాలని పలుమార్లు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడుతున్నారు.
దేవాపూర్ ఓరియంట్ సిమెం ట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈశ్వర మ్మ ఎన్నికల ప్రక్రియపై వివరాలను వెల్లడించారు.
బెల్లంపల్లి నియో జకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాము మం జూరు చేసిన నిధులతో పనులు చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు.
కమ్యూనిస్టులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ను శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాల యంలో విడుదల చేశారు.