Home » Adilabad District
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్-విజయవాడ వరకు తలపెట్టిన రహదారి నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం టేకుమట్ల, ఎల్కంటి, శెట్‌పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్,వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును తెలుసుకున్నారు.
ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలని, రక్తధానం ప్రాణధానంతో సమానమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తధాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునిల్ మాదిగ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్‌లను, వార్డులను పరిశీలించారు.
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో..
గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్ చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పీఆర్‌టీయూటీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి పీఆర్‌టీయూటీఎస్ పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగేందర్ శనివారం వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం పత్తి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలకు దిగుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.