Home » Accident
నెల్లూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 65 మంది గాయపడ్డారు. కందుకూరులో కూలీల ట్రక్కు బోల్తా పడగా, రాపూరులో భక్తులతో వెళ్ళిన ఆటో ప్రమాదానికి గురైంది
నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ముందు ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న తండ్రి, అతని కుమార్తె మరణించారు.
మరణం ఏ రూపంలో వస్తుందో అంటే ఇదేనేమో.. సాయం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు దుర్మరణం పాలయిన విషాద సంఘటన ఇది. ఇన్నోవా కారుకు టైరు మార్చేందుకు సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు రోడ్డు ప్రమాదం అతడిని చిదిమేసింది. ఎక్కడో ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చూస్తూ అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం అతడిని అందనంత దూరాలకు తీసుకెల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్‌లో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కుడి భుజానికి తీవ్ర గాయం కలిగింది. హైదరాబాద్‌లో కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ పథకం త్వరలో అమల్లోకి వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో 10 నిమిషాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ వేగంగా దూసుకెళ్లిన కారు పూరింట్లోకి బలంగా ఢీకొని ఐదుగురు మెడికో విద్యార్థులు మరియు ఓ వృద్ధుడు మృతిచెందారు. మితిమీరిన వేగం ప్రాణాంతక ప్రమాదానికి కారణమై, సమస్తం తుడిచిపోయింది