Home » ABN Andhrajyothy Effect
మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ పేదల పొట్ట కొడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న పసికూన ఆరుషీని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.
ఒకే రంగానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అన్నింటిలోనూ తామే ముందుండాలని, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని.. కసిగా దూసుకెళ్తుంటారు. అయితే..
బ్లడ్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయతను చూపారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ‘ప్లీజ్ నా బిడ్డను ఆదుకోండి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సీఎం స్పందించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైయస్ జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా రుజువులతో సహా బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దిగిచ్చింది. అందుకు సంబంధించిన సీడీఎంఏ వెబ్‌సైట్‌ని చాలా సైలెంట్‌గా మూసివేసింది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు.
ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూదాన్ భూమి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భూమిని కొట్టేశారని వివరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు వచ్చిన కథనం అక్షర సత్యం అని వివరించారు.
తెలంగాణను బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దోచుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రవీంద్రనాయక్ (Ravindra Naik) ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులపై సీబీఐ, ఈడీ చేత విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి , ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని చెప్పారు.