Home » AarogyaSri Health Cards
కాంగ్రెస్ సర్కారు ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆస్పత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా.. ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది.
11 సంవత్సరాల తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డుతో లింకులు.. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత తీపి కబురే చెప్పారు...