Home » AAP
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ అధికార పక్షం ఆప్ ప్రతిపక్ష నేత ఆతిషీతో సహా 12 మంది ఎమ్మెల్యేలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని బజ్వా మరో సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ ఆయనను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అసెంబ్లీలో ఉద్రిక పరిస్థితులు తలెత్తడంతో స్పీకర్ వెంటనే జోక్యం చేసుకుని విపక్ష నేతలను మందలించారు. ఇది కర్టెసీ అడ్రెస్ అని, దీనిని రాజకీయ వేదక చేయవద్దని కోరారు.
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.
మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌కు కేటాయించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.
ప్రతాప్‌గంజ్ ఏరియాలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆస్తులను మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలు ఎత్తుకెళ్లిపోయారని బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ఆరోపించారు.
బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమ్మకం లేదని, ఆ పార్టీకి ఒక విజన్ కానీ, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యూహం కానీ లేవని అతిషి విమర్శించారు.