Home » AAP
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో ఆదివారంనాడు చేరారు. వారికి బీజేపీ ఢిల్లీ యూనిట్ పార్టీ కండువా కప్పి స్వాగతించింది.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని సుల్తాన్‌పూర్ కోర్టు మంగళవారం ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఆగస్ట్ 28వ తేదీ జరిగే విచారణకు ఆయన్ని హాజరు పరచాలని పోలీసులకు కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టులో దాదాపు 23 ఏళ్ల క్రితం నాటి కేసు విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ఎగురవేస్తారు. అతిషిని జాతీయపతాకం ఎగురవేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారంనాడు తెలిపారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.
దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.