Home » AAP
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఆదివారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో అన్నా హజారే విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని కేజ్రీవాల్‌ను హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు.
దాదాపు ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారంనాడు జరిపిన పార్టీ సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పారు.
ఇండియా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌లు హోరాహోరీ తలపడతాయా? ఆప్‌తో పొత్తు ఇకముందూ కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్, బీజేపీ స్పష్టంగా పడే అవకాశముందని అంటున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయన వారసులు ఎవరే ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుంది. అలాంటి వేళ ఢిల్లీ మంత్రి అతిషి పేరు కేజ్రీవాల్ వారసురాలిగా తెరపైకి వస్తుంది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.