• Home » 2024

2024

GOKULAM : గోకులంపై రైతుల ఆసక్తి

GOKULAM : గోకులంపై రైతుల ఆసక్తి

పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది.

CHRISTMAS : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

CHRISTMAS : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

మానవాళికి దివ్యసందేశాలను వినిపిం చిన యేసుక్రీస్తు భూమిపై అవతరించిన రోజైన క్రిస్మస్‌ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందాయి. ప్ర త్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వ హించారు.

SONGS : అలరించిన గాన స్వరాంజలి

SONGS : అలరించిన గాన స్వరాంజలి

సినీ గాయకుడు మహమ్మద్‌ రఫి జయంతిని పురస్కరించుకుని సాదియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గాన స్వరాంజలి వీక్షకులను ఎంతగానో అలరించింది. స్థానిక లలిత కళా పరిషత ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్ర మాన్ని పరిషత ప్రధాన కార్యదర్శి పద్మజ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

MLA : శివారు కాలనీలపై ఐదేళ్ల నిర్లక్ష్యం

MLA : శివారు కాలనీలపై ఐదేళ్ల నిర్లక్ష్యం

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగర శివారు కాలనీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికీ - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 22వ డివిజన పరిధిలోని మరువకొ మ్మ కాలనీలో టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించా రు.

CHRISTMAS : సెమీ క్రిస్మస్‌ వేడుకలు

CHRISTMAS : సెమీ క్రిస్మస్‌ వేడుకలు

స్థానిక అర్బన బ్యాంకులో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయభవన అర్బనబ్యాంకులో మంగళవారం సెమీ క్రిస్మస్‌ వే డుకల్లో భాగంగా పాస్టర్‌ సురేష్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చైర్మన జేఎల్‌ మురళీధర్‌ కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. ప్రజలకు చీకటి నుంచి వెలుగుపంచడమే తన జీవితపరమార్థమని యేసు పేర్కొన్నట్లు వివరించా రు.

OFFICER : తీరు మారలేదు..!

OFFICER : తీరు మారలేదు..!

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు మారలేదు, కమీషన్లలో తగ్గేదేలా అన్న తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆ శాఖ వర్గాల నుంచే అభిప్రా యాలు వెలువుడుతున్నాయి. పత్రికల్లో వరుస కథనా లు వస్తున్నా, ఆ శాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారులు చివాట్లు పెట్టినా, కలెక్టర్‌ అవినీతిపై ఆరా తీస్తున్నా ఆయనలో ఇసుమంతైనా భయం కనిపించ కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

MLA : కూటమి పాలనపై ప్రజల్లో హర్షం

MLA : కూటమి పాలనపై ప్రజల్లో హర్షం

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం స్థానిక 23వ డివిజనలోని ఫెర్రర్‌ నగర్‌లో కార్పొరేటర్‌ హరిత, టీడీపీ నా యకులు, అధికారులతో కలిసి పర్యటించారు.

MLA : విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి

MLA : విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి

విద్యార్థులు సెల్‌ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్‌ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నా రు. కేక్‌కట్‌ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్‌ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు.

CHRIST MAS : క్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం

CHRIST MAS : క్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం

క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. అరవిందనగర్‌లోని సీయ్‌సఐ హోలి ట్రినిటి చర్చిలో సోమవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ప్రీక్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు.

DIRTY : మురుగునీటితో సహజీవనం

DIRTY : మురుగునీటితో సహజీవనం

ఓ అపార్ట్‌మెంట్‌ వారి నిర్వాకం వల్ల దాని చుట్టు పక్కల నివశించే వారు ఆర్నెల్లుగా మురు గునీటితో సహజీవనం చేస్తున్నారు. మండలంలోని పాపంపేట పంచాయతీ గణే్‌షనగర్‌లో ఈ పరిస్థితి కనిసిస్తుంది. అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు డ్రైనేజీ కాలువపై ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ ర్యాంప్‌ దెబ్బతిని కాలువలోకి కుదువబడిపోయింది. ఫలితంగా మురుగు నీరు ముందుకు సాగేందుకు వీ లు లేకుండా పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి