Home » 2024
పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలను నీటితో నింపాలని జిల్లా పండ్లతోటల రైతుసంఘం నాయకులు కోరారు. వారు బుధవారం పీఏబీ ఆర్, జీడిపల్లి రిజర్వాయర్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ... పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న సగం చెరువులను మాత్రమే నీటితో నింపు తామని జలవనరుల శాఖ అధికారులు చెప్పడం సరికాదన్నారు.
ప్రయాణి కుల ద్వారా జరిమానాలు వసూలు చేసేందుకు ఆర్టీసీ భద్రతా సిబ్బంది అత్యుత్సాహం కనబరుస్తున్నారు. వృద్ధుల నే కనికరం లేకుండా అందరిపై విరుచుకుపడుతున్నారు. తమవారిని బస్సు ఎక్కించేందుకు బస్టాండుకు వచ్చామని చెబుతున్నా వినిపించుకోకపోతుండడం వల్ల ప్రయణికులు అసహ నానికి గురవుతున్నారు.
రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జ్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ సూచించారు. స్థానిక ఎన్టీఆర్ సహకార భవనలో బుధవారం ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు చెల్లించాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅథులుగా ఎంపీ, ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలకు డ్రోన ద్వారా మందుల పిచికారీ గురించి రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా వివరించారు.
ప్రతి నెలా ఒకటో తేదీ రాకనే ఇంటి ముందుకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఎమ్మెల్యే మంగళవారం చెన్నేకొత్తపల్లి మండలంలోని హరియనచెరువు గ్రామంలో ఇటింటికి వెళ్లి పింఛనలను పంపిణీ చేశారు. అలాగే రామగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో మంగళవారం ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. హట్‌హాక్స్ న్యూజిలాండ్, హైదరాబాద్ పీకే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 25.4 ఓవర్లలో 194 పరు గులకు ఆలౌట్ అయింది.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ప్రజా స్పందన కరువై పెయిడ్ ఉద్యమాలు చేస్తు న్నారని వైసీపీ అధినేత జగనపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మంగళవారం నగరంలోని 41వ డివిజనలోని హైదర్‌వల్లి కాలనీ, ఎల్బీ నగర్‌లో సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
ధనుర్మాసోత్సవాలను పుర స్కరించుకుని సోమవారం సాయంత్రం మొదటి రోడ్డు లోని కాశీవిశ్వేశ్వరా లయం లో గోదారంగ నాయక స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని వేదికపై గోదాదేవి, రంగనాయక స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు.
నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో సోమవా రం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్పీ జగదీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీస్ నియామక ప్రక్రియలో భాగం గా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అ ర్హత సాధించిన జిల్లాలోని అభ్యర్థులకు దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించారు.
మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా ఏన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల (మిడ్‌పెన్నార్) డ్యాం లోకి సోమవారం మిషన ఫింగర్లింగ్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌ఐ) పథకం ద్వారా వివిధ రకాల 12 లక్షల చేపపి ల్లలను వదిలారు.