• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Kinjarapu Rammohan Naidu: సివిల్‌ ఏవియేషన్‌లో మోడల్‌ స్టేట్‌గా ఏపీ

Kinjarapu Rammohan Naidu: సివిల్‌ ఏవియేషన్‌లో మోడల్‌ స్టేట్‌గా ఏపీ

పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్‌ స్టేట్‌)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Kishan Reddy : బొగ్గు, గనులతో  దేశానికి ఆదాయం

Kishan Reddy : బొగ్గు, గనులతో దేశానికి ఆదాయం

బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు.

Supriya Srinathe : ఎవరు తీసిన గోతిలో వారే..

Supriya Srinathe : ఎవరు తీసిన గోతిలో వారే..

‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చైర్‌పర్సన్‌ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్‌ చేశారు.

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ..

Delhi: మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు

Delhi: మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు

ఎన్డీయే కూటమి అధ్యక్షునిగా భాగస్వామ్య పార్టీలు నరేంద్ర మోదీని ఎన్నుకోవడంతో ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది.

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన త్వరలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని వస్తున్న వదంతులపై ఆ పార్టీ ఖండించింది. తాము ఇండియా కూటమిలోనే కొనసాగనున్నామని స్పష్టం చేసింది. శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ గురువారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ..

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్‌ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

BJP : కొత్త టీంపై కసరత్తు

BJP : కొత్త టీంపై కసరత్తు

వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాలను ఆహ్వానించారు.

BJP vs Congress: బీజేపీ vs కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత?

BJP vs Congress: బీజేపీ vs కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత?

‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి (BJP) గట్టి షాక్ తగిలింది. తాము వేసిన అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి