16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్‌లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..
అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) వైసీపీ (YSRCP) ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితి. ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరూ గెలవలేదు. తిరుగులేదనుకున్న నేతలు సైకిల్, గ్లాస్ సునామీకి చతికిలపడ్డారు...
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...
అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ (YSRCP) ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.
అవును.. అక్షరాలా దేవుడి స్క్రిప్టే..! ఏపీ ఎన్నికల ఫలితాలతో (AP Election Results) సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది..! 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ (TDP) పరిమితం కావడంతో.. వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా హేళన చేసిందో.. ఎంతలా కించపరుస్తూ మాట్లాడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది..!
సమగ్రశిక్ష ప్రాజెక్టులో అనర్హులకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. అడ్మిషన్ల వేళ సెక్టోరియల్ కేడర్‌కు చెందిన అత్యంత కీలకమైన జీసీడీఓ పోస్టు అసిస్టెంట్ సెక్టోరియల్‌కు ఇనచార్జిగా అప్పగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోలింగ్ తర్వాత, ఫలితాలకు ముందు వచ్చే సర్వేలు.! సెమీ ఫైనల్ లాంటి ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు లేదా ఆ తర్వాత రోజు రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యి.. దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం కాస్త జూన్-01 వరకూ వెళ్లింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వడంతో ఇవాళ అనగా శనివారం నాడు..
లోక్‌సభ సార్వత్రక ఎన్నికలు జూన్1న ఏడో దశతో ముగియనున్నాయి.