హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపైఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు...
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది.
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి.
దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు.
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 60వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.