వాతావరణ అనిశ్చితి.. 16 నుంచి వర్షాలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:01 AM
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వస్తుండడంతో...
విశాఖపట్నం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వస్తుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో ఈ నెల 15న ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, 16వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 17 నుంచి 20 వరకూ పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.