Share News

నేడు అల్పపీడనం

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:24 AM

బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

నేడు అల్పపీడనం

  • ఛత్తీస్‌గఢ్‌ వైపు వస్తేనే కోస్తాంధ్రకు ప్రయోజనం

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వ హణ సంస్థ ప్రకటించింది. గురువారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమంగా పయనించి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు వస్తేనే కోస్తాంధ్రకు ప్రయోజనమని, లేదంటే నిరాశే మిగిల్చనున్నదని అంచనా వేశారు.

Updated Date - Sep 10 , 2026 | 06:24 AM