Share News

వారం పాటు భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:03 AM

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

వారం పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, మెదక్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌గనగర్‌ జిల్లాలో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మరోవైపు ములుగు జిల్లా వెంకటాపురంలో 6.9, ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోతాదు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో చిరుజల్లులు కురిశాయి. తొగుట మండలంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.

Updated Date - Jun 28 , 2026 | 03:03 AM