ఈ నెల 18-20 వరకు భారీ వర్షాలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:20 AM
తెలంగాణలో ఈనెల 18నుంచి 20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ మూడు రోజులకు యెల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ఈనెల 18నుంచి 20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ మూడు రోజులకు యెల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ఈ నెల 18న రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో అత్యధికంగా 12, గద్వాల జిల్లా కాలూర్ తిమ్మనదొడ్డిలో 9, వికారాబాద్ జిల్లా పూడూరులో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 375 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.