మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 45.7 డిగ్రీలు
ABN , Publish Date - May 18 , 2026 | 02:50 AM
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల ....
వడదెబ్బతో ముగ్గురి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్):
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. నిజామాబాద్ జిల్లాలోని మోస్రా, పోతంగల్ మండలాలు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైనాలో 45 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మం డలం ఎల్పుగొండలో 45.1, రామారెడ్డిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ ఆ మండలాలను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. బాన్సువాడ మండలం కొల్లుర్‌లో 44.9, బీర్కూర్ 44.7, మద్నూర్, మేనూర్ లో 44.6, బిచ్కుందలో 44.4, కోరుట్ల మండలం అయులాపుర్‌లో 44.4, కొడిమ్యాల మండలం పూడూర్‌లో 44.3, కోరుట్లలో 44.2, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపుర్‌లో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వడగాడ్పులు, ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఆదివారం వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారంలో అంగన్‌వాడీ టీచర్ శ్రీలత(36), కరీంనగర్ జిల్లా మానకొండూరులోని లక్ష్మీనగర్‌కు చెందిన రాజయ్య (65), మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీపతినగర్‌కు చెందిన బుర్ర నమీత్‌గౌడ్ (18)వడదెబ్బతో మృతి చెందారు. కాగా, వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.