Share News

నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:29 AM

భానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ..

నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆదివారం 35 నుంచి 36.4 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లోనూ 37 నుంచి 39 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 36 నుంచి 37డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Updated Date - Mar 02 , 2026 | 01:29 AM