Share News

నిజామాబాద్‌ జిల్లాలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:23 AM

రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు సమీపించాయి.

నిజామాబాద్‌ జిల్లాలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు సమీపించాయి. శనివారం 8 జిల్లాల్లో గరిష్ఠంగా 40.5 నుంచి 40.1 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా మోస్రాలో అత్యధికంగా 40.5 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాల జిల్లా నేరెళ్ల, నల్లగొండ జిల్లా ముల్కచర్ల, నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Updated Date - Mar 29 , 2026 | 07:25 AM