Share News

స్వల్పంగా తగ్గిన ఎండ

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:49 AM

రాష్ట్రంలో ఎండ ప్రభావం మంగళవారం స్వల్పంగా తగ్గింది. పలుచోట్ల పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణంగా...

స్వల్పంగా తగ్గిన ఎండ

విశాఖపట్నం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ ప్రభావం మంగళవారం స్వల్పంగా తగ్గింది. పలుచోట్ల పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణంగా, మరికొన్నిచోట్ల రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. నంద్యాలలో 36.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Mar 11 , 2026 | 04:50 AM