Share News

సంజామలలో 44.6 డిగ్రీలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:26 AM

రాయలసీమ, కోస్తాల్లోని అనేక ప్రాంతాలు బుధవారం ఉడికిపోయాయి. విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం రాష్ట్రంలోని 275 మండలాల్లో...

సంజామలలో 44.6 డిగ్రీలు

  • 275 మండలాల్లో 40 డిగ్రీలు దాటి నమోదు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కోస్తాల్లోని అనేక ప్రాంతాలు బుధవారం ఉడికిపోయాయి. విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం రాష్ట్రంలోని 275 మండలాల్లో 40.. అంతకంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా సంజామలలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లోని 34 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గురువారం 10 జిల్లాల్లో 43-44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Apr 16 , 2026 | 05:26 AM