Share News

Severe Cyclonic Storm: బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:11 AM

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 660 కి.మీ., శ్రీలంకలోని బట్టికోలకు...

Severe Cyclonic Storm: బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం

  • నేడు శ్రీలంకలో తీరం దాటే అవకాశం

విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 660 కి.మీ., శ్రీలంకలోని బట్టికోలకు 140 కి.మీ., ట్రింకోమలైకు తూర్పు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్యంగా పయనించి శనివారం మధ్యాహ్నంలోగా ట్రింకోమలై, జాఫ్నా మధ్య తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం నుంచి క్రమేపీ బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి జిల్లా అరకులోయలో 4.3 డిగ్రీలు నమోదైంది.

Updated Date - Jan 10 , 2026 | 05:11 AM