Share News

రాయలసీమలో సెగలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:15 AM

రాయలసీమ, దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఉదయం నుంచి వేడి వాతావరణం నెలకొంది.

రాయలసీమలో సెగలు

  • కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీలు

విశాఖపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఉదయం నుంచి వేడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిహార్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో మేఘాలు ఆవరించి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 09 , 2026 | 05:15 AM