Share News

Weather: 8, 9 తేదీల్లో అల్పపీడనం

ABN , Publish Date - Jan 05 , 2026 | 04:50 AM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం...

Weather: 8, 9 తేదీల్లో అల్పపీడనం

విశాఖపట్నం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో తొమ్మిదో తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మంచు దట్టంగా కురిసింది. రానున్న రెండు, మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jan 05 , 2026 | 04:52 AM