Share News

ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షం

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:01 AM

బిహార్‌ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ, మరట్వాడా వరకు, తమిళనాడు నుంచి కర్ణాటక వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి.

ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షం

విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ, మరట్వాడా వరకు, తమిళనాడు నుంచి కర్ణాటక వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు కోస్తా, రాయలసీమపైకి వీస్తున్నాయి. దీంతో సోమవారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత తగ్గింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. కర్నూలులో 37.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, బుధవారం నుంచి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 10 , 2026 | 05:02 AM