Share News

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చాలా చోట్ల తేలికపాటి...

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, గద్వాల జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరోవైపు వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేట్‌లో అత్యధికంగా 6.8, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Jun 22 , 2026 | 05:03 AM