Share News

హైదరాబాద్‌లో భానుడి భగ భగలు!

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:54 AM

హైదరాబాద్‌లో వేసవి వేడి అప్పుడే మొదలైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు ప్రతాపాన్ని చూపిస్తూ పగటి ఉష్ణోగ్రతలను 37 డిగ్రీలకు చేర్చాడు.

హైదరాబాద్‌లో భానుడి భగ భగలు!

  • మార్చి మొదటి వారంలోనే 37 డిగ్రీలు

  • వచ్చే 10 రోజుల్లో 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వేసవి వేడి అప్పుడే మొదలైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు ప్రతాపాన్ని చూపిస్తూ పగటి ఉష్ణోగ్రతలను 37 డిగ్రీలకు చేర్చాడు. ముఖ్యంగా ఎల్‌బీనగర్‌ వంటి ప్రాంతాల్లో గరిష్ఠంగా 36.8 డిగ్రీలు నమోదు కాగా, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌ వంటి ప్రాంతాల్లో కూడా 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి 1-2 డిగ్రీల మేర ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం గమనార్హం. వచ్చే 10 రోజుల్లో గ్రేటర్‌ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లోనే ఉష్ణోగ్రతలు మరో రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే సూచనలు ఉన్నాయి.

Updated Date - Mar 04 , 2026 | 02:54 AM