Share News

మండిన రాష్ట్రం.. కావలిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:24 AM

మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో పలుచోట్ల బుధవారం కంటే..

మండిన రాష్ట్రం.. కావలిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో పలుచోట్ల బుధవారం కంటే ఏకంగా ఐదు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కావలిలో 39.2 డిగ్రీలు, కర్నూలులో 39.1, కడపలో 39, నెల్లూరులో 38.9, నంద్యాలలో 38.8, ఒంగోలులో 38.7, అమరావతిలో 38.4, తిరుపతి, జంగమహేశ్వరపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 06 , 2026 | 04:25 AM